రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, విగ్రహాల మీద దాడులతో.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. మతాలను అడ్డం పెట్టుకుని.. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు.
కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి భక్త సంచారం లేక.. దేవాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉందని అష్టాక్షరి త్రిదండి రామానుజాజీయర్ స్వామి గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమూ కష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.