కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని...వెంటనే క్యారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల పరీక్షలు నిర్వహించి 15 రోజులు గడుస్తున్నా... ఫలితాలు రాకపోవటం దారుణమన్నారు. నాగాయలంక మండలంలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలకు వాలంటీర్లు, పోలీసులు అంతిమ సంస్కారాలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు.
కొవిడ్ కట్టడిలో ప్రభుత్వం విఫలం: మండలి బుద్ధప్రసాద్
గ్రామీణ ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. కొవిడ్ ఫలితాలను ఆలస్యం కాకుండా వెంటనే చెప్పాలని కోరారు.
corona control in state