రాజకీయాల్లో నమ్మకస్థులైన అనుచరులు, నిస్వార్దంగా పని చేసే కార్యకర్తలు చాలా అరుదుగా ఉంటారని.. అలాంటి గుణాలున్న వారిలో ప్రధమశ్రేణిలో నరసింహరావు నిలబడతారని మండలి బుద్ద ప్రసాద్ విజయవాడలో కొనియాడారు. నరసింహరావు మృతికి మండలి బుద్ద ప్రసాద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహరావు లాంటి వారు ఊరుకొకరున్నా అద్బుతాలు చేయోచ్చన్నారు. ఆయనను చివరి చూపు చూడలేక పోయానని బుద్ద ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్దిస్తూ, కుటంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
అలాంటివారు ఊరికి ఒక్కరుంటే చాలు: మండలి బుద్ధప్రసాద్ - mandali budda prasadh latest comments
కోసూరివారిపాలెం గ్రామ ప్రముఖులు, పాలకేంద్రం అధ్యక్షులు కోసూరు నరసింహరావు మరణవార్త నన్నెంతో బాధించిందని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. గ్రామ అభివృద్ధి గురించి నిరంతరం శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు.
పాలకేంద్రం అధ్యక్షులు కోసూరు నరసింహరావుకు మండలి సంతాపం