ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండుసార్లు ఓటు వేసిన వ్యక్తి... ఛాలెంజ్ ఓటుగా పరిగణించాలని జేసీ సూచన - కృష్ణా జిల్లా నేటి వార్తలు

కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ వ్యక్తి రెండుచోట్ల ఓటు వేయడం కలకలం రేపింది. అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా... రెండుచోట్ల ఓటు వేసినట్లు అతను అంగీకరించాడు. ఈ అంశాన్ని ఛాలెంజ్ ఓటుగా పరిగణించాలని జాయిట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.

man voted twice in Pedana municipal elections at krihsna district
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత

By

Published : Mar 10, 2021, 9:24 PM IST

కృష్ణా జిల్లా పెడనకు చెందిన ఎర్రంశెట్టి రామకృష్ణ ఉదయం 12వ వార్డులో ఓటు వేసి, మళ్లీ 13వ వార్డులోనూ ఓటు వేశాడు. దీనిని గమనించిన ఓ వ్యక్తి అధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా తాను రెండుచోట్ల ఓటు వేసినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు. అదే సమయంలో పోలింగ్ బూత్ పరిశీలించడానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఆర్డీఓ ఖాజావలికి అధికారులు ఈ విషయాన్ని వివరించారు. ఫలితంగా రామకృష్ణ వేసిన ఓటును ఛాలెంజ్ ఓటుగా పరిగణించాలని జాయింట్‌ కలెక్టర్ అధికారులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details