గుంటూరు జిల్లా చేబ్రోలు మండల కేంద్రానికి చెందిన కోట వెంకట మధుమోహన్... తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా... ఒంటరిగా నివాసముంటున్నాడు. అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య చికిత్సకు అతని వద్ద ఉన్న నగదు అయిపోయింది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులను అమ్ముకునేందుకు ప్రయత్నించాడు.
దీనికి వెంకట మధుమోహన్ సోదరుడి కుటుంబసభ్యులు అడ్డుపడుతున్నారు. తీవ్ర మనస్థాపానికి గురైన మధుమోహన్.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలంటూ 8 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.