వంద ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసింది. నలుగురి వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ..బ్లేడు దాడులకు దారితీసేలా చేసింది. నలుగురు వ్యక్తులు ఓ సమూహంలోఒకరిపై మరొకరు బ్లేడ్లతో గాయపరుచుకున్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొంతు భాగం, ముఖంపై గాయపర్చడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి .
విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో.. పైపులరోడ్డు-వాంబేకాలనీ మార్గంలోని దుర్గాబార్ వద్ద..నలుగురు వ్యక్తులు బ్లేడ్లతో ఒకరిపై దాడి చేసుకున్నారు.ఈ ఘటనతో ఆ ప్రాంతం మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాంబేకాలనీకి చెందిన దొడ్డ కిషోర్, షేక్ రఫీ, బొడ్డుపల్లి నాగరాజు అలియాస్ పండు, రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ నలుగురూ సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. ఏప్రిల్ 1వ తేదీన..గన్నవరంలో పనికి వెళ్లారు. అక్కడ పనులు ముగిసిన తర్వాత మేస్త్రీ 2వేల రూపాయలు ఇవ్వగా ఆ నగదును సమాన భాగంలో పంచుకోకుండా..దొడ్డ కిషోర్, రఫీ, హుస్సేన్‌లు 500 రూపాయలు చొప్పున తీసుకుని, నాగరాజుకు మాత్రం... 100 తగ్గించి 400 రూపాయలు ఇచ్చారు. ఈ విషయమై వాంబేకాలనీ రోడ్డులోని అన్నపూర్ణా బార్ వద్ద అదే రోజు రాత్రి గొడవ జరగడంతో నాగరాజుకు 100 రూపాయలు తిరిగి ఇచ్చేసి.. ఇకపై పనిలోకి రావద్దని ముగ్గురు చెప్పారు.
శుక్రవారం కిషోర్, రఫీ, హుస్సేన్‌లు కలిసి దుర్గాబార్‌లో మద్యం సేవించి .. నాగరాజుకు ఫోన్ చేయగా ఉదయం 10 గంటల ప్రాంతంలో బార్ వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చాడు. బార్ పక్కన వీధిలోకి వెళ్లిన నలుగురు మద్యం మత్తులో ఉండి.. పనిలోకి రావద్దని చెప్పిన విషయమై గొడవపడ్డారు. నలుగురు మధ్య మాటా మాటా పెరిగిపోవడంతో.... కిషోర్, రఫీ, హుస్సేన్‌లు కలిసి బ్లేడ్‌తో నాగరాజుపై దాడి చేశారు. ఇదే సమయంలో..పెనుగులాటలో మిగిలిన ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 100కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నలుగురిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగరాజు చనిపోయాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. అవివాహితుడైన నాగరాజు వాంబే కాలనీ ఎఫ్ బ్లాక్‌లో నివాసముంటున్నాడు. ఘటనా స్థలంలో రక్తపు మడుగు చూసి స్థానికులు సైతం హడలిపోయారు. నార్త్‌జోన్ ఇన్‌ఛార్జి ఏసీపీ ఎం.రమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హుస్సేన్‌పై రౌడీషీటు