విజయవాడ కృష్ణలంక శనీశ్వరాలయం పరిసరాల్లో పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి ఈతకు దిగి యువకుడు గల్లంతయ్యాడు. అతణ్ని గన్నవరం మండలం ముస్తాబాద్‌కి చెందిన రమేష్‌గా గుర్తించారు.
కృష్ణా నదిలో స్నానానికి దిగి.. యువకుడి గల్లంతు - శనీశ్వరాలయం సమీపంలో యువకుడి గల్లంతు
కృష్ణా నదిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన కృష్ణలంక శనీశ్వరాలయం పరిసరాల్లో జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

man missing in river
విజయవాడలో సర్జికల్ దుకాణంలో పనిచేస్తున్న రమేశ్ తనతో పనిచేస్తున్న రవి, అనిల్ అనే స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో దిగిన క్రమంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులు సమాచారామివ్వగా.. ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అచూకీ లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపేశారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:తాడేపల్లి అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగవంతం