తెలంగాణ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో నిన్న రాత్రి అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యమైంది. ఉదయం బాలికను ప్రగతినగర్‌లో తాపీ మేస్త్రీ శ్రీను వదిలివెళ్తుండగా... గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను మేస్త్రీ శ్రీను అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
GIRL KIDNAP: బాలిక కిడ్నాప్.. స్పృహలేని స్థితిలో ఆచూకీ - మేడ్చల్ బాలిక కిడ్నాప్
తెలంగాణ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలో నిన్న రాత్రి అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యమైంది. బాలికను తాపీ మేస్త్రీ శ్రీను వదిలి వెళుతుండగా స్థానికులు చూసి...అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
బాలిక కిడ్నాప్
ఒంటిపై గాయాలతో స్పృహలేని స్థితిలో ఉన్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అదృశ్యంపై నిన్న రాత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడు శ్రీనివాస్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:Dead Bodies : చెరువులో ముగ్గరు బాలికల మృతదేహాలు.. హత్యా?