ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అనుమానంతో మృతదేహం అడ్డగింత.. పోలీసుల చొరవతో అంత్యక్రియలు - నారాయణపురంలో పోలీసుల చొరవతో వ్యక్తి అంత్యక్రియలు

కృష్ణా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా.. కరోనాతో మృతి చెందాడని గ్రామస్థులు.. మృతదేహాన్ని గ్రామంలోకి రానివ్వలేదు. పోలీసులు గ్రామస్థులతో చర్చించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పించారు. అనంతరం పంచాయతీ సిబ్బందితో గ్రామంలో శానిటైజేషన్ చేయించారు.

funarla with police initiation
funarla with police initiation

By

Published : May 9, 2021, 9:25 PM IST

కరోన వైరస్ మానవ సంబంధాలను మంటగలుపుతోంది. అనారోగ్య కారణాలతో మృతి చెందినప్పటికీ కొన్ని గ్రామాల్లో అవసరం లేని అనుమానాలతో... అంత్యక్రియలు నిర్వహించకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.

అతను కరోనా వైరస్ తో చనిపోయాడని, అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తే.. గ్రామమంతా కరోనా వ్యాప్తి చెందుతుందని గ్రామస్థులు మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై మదీనా బాషా.. ఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్థులతో చర్చించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పించారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామంలో శానిటైజేషన్ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details