ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. బంధువుల ధర్నా - కృష్ణాజిల్లా తాజా వార్తలు

మద్యం దుకాణం వద్ద ఘర్షణ చేలరేగింది. మత్తులో కొందరు వ్యక్తులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్​ రోడ్డు (నల్లబండగూడెం) వద్ద జరిగింది. ఇందులో.. రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు. మద్యం దుకాణం సిబ్బంది దాడిలోనే తమ వారు మరణించారంటూ.. బంధువులు ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణం లైసెన్స్​ రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ధర్నాకు దిగిన మృతుడి  బంధువులు
ధర్నాకు దిగిన మృతుడి బంధువులు

By

Published : Aug 29, 2021, 7:06 PM IST

Updated : Aug 29, 2021, 7:39 PM IST

ధర్నాకు దిగిన మృతుడి బంధువులు

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​ రోడ్డు (నల్లబండగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్​ వైన్స్​ వద్ద జరిగిన దాడిలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమాద్​పేటకు చెందిన నాగేశ్వరావు మృతిచెందాడు. మద్యం దుకాణం సిబ్బంది దాడిలోనే నాగేశ్వరరావు మరణించినట్లు బంధువులు ఆరోపించారు.

దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆందోళనకారులను నచ్చజెప్పినా వారు శాంతించలేదు. మద్యం దుకాణ లైసెన్సు రద్దుచేయాలంటూ బంధువులు నినాదాలు చేశారు.

Last Updated : Aug 29, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details