కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో.. మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు దళితవాడకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జంపన బాలకృష్ణగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పంటకాలువలో పడి.. వ్యక్తి మృతి - telaprolu
మద్యం మత్తులో పంట కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ప్రభుత్వ మద్యం షాపు సమీపంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో పంటకాలువలో పడి వ్యక్తి మృతి