ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు కాల్వలో ట్రాక్టర్​ బోల్తా.. వ్యక్తి మృతి - tractor accident gannavaram

పొలం చదునుచేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ మరణించిన విషాద ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగింది. పంట పొలాన్ని చదును చేసి పక్కకి నిలిపివేయడంతో డ్రైవర్ స్నేహితుడు మేకా ప్రశాంత్ కుమార్ ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేయగా.. ఒక్కసారిగా వాహనం ముందుకు దూసుకుపోయింది. భయంతో కాల్వలోకి దూకేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి ట్రాక్టర్ మీద పడి తుదిశ్వాస విడిచాడు.

ప్రమాదవశాత్తు కాల్వలో ట్రాక్టర్​ బోల్తా.. వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు కాల్వలో ట్రాక్టర్​ బోల్తా.. వ్యక్తి మృతి

By

Published : Oct 2, 2020, 11:28 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. పంట పొలం చదును చేసేందుకు ట్రాక్టర్​పై డ్రైవర్ సహా అతని స్నేహితుడు కలిసి వెళ్లగా.. డ్రైవర్ పొలం దున్నాడు. మంచినీళ్లు తాగేందుకు ట్రాక్టర్ ఆపి చేను పక్కకు వెళ్లగా స్నేహితుడు మేకా ప్రశాంత్ కుమార్ ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది.

భయంతో దూకేశాడు..

భయంతో ట్రాక్టర్​పై నుంచి కాల్వలోకి దూకేశాడు. దురదృష్టవశాత్తు ట్రాక్టర్ అతనిపై తిరగపడింది. ట్రాక్టర్ డ్రైవర్, పొలం యజమాని, చుట్టుపక్కల వారు కాపాడేందుకు ప్రయత్నం చేసినా విఫలయత్నం అయ్యింది. ఫలితంగా బాధితుడు మేకా ప్రశాంత్‌ కుమార్‌ ప్రాణాలు విడిచాడు.

పోస్ట్​మార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి..

సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details