స్కూటీపై పుల్లతో గీశాడనే కోపంతో ఆరేళ్ల బాలుడి కాలు విరగొట్టిన ఘటన కృష్ణాజిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరువూరుకు చెందిన బొల్లికొండ చెన్నారావు అనే వ్యక్తి ఈనెల 18న అప్పనాలపేటకు స్కూటీపై వెళ్లాడు. అదే సమయంలో అక్కడ మిత్రులతో ఆడుకుంటున్న మిద్దె మణికంఠ.. ఆగి ఉన్న స్కూటీపై పుల్లతో గీశాడు.
అది గమనించిన చెన్నారావు కర్రతో విచక్షణారహితంగా మణికంఠను కొట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం కూలీ పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు.. నడవలేని స్థితిలో ఉన్న మణికంఠను చూసి బాలుడి మిత్రుల్ని విచారించారు. అసలు విషయం తెలిసిన తరువాత చెన్నారావును ప్రశ్నించారు. అతను దురుసుగా సమాధానమివ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.