ఈ నెల 4న పట్టణంలోని అమ్మాని కళాశాల సమీపంలో రాత్రి 8 గంటల సమయంలో నకిరికంటి సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కుని దొంగలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీస్ శాఖ సీసీ ఫూటేజీ ఆధారంగా మానేపల్లి లక్ష్మణరావుగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రెండు లక్షల విలువైన 44 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు. నిందితుడు లక్ష్మణరావు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బంగారం దొంగిలించిన వ్యక్తి అరెస్ట్ - Gold steal in vijayawada latest News
కృష్ణా జిల్లా విజయవాడలో నకిరికంటి సీతామహాలక్ష్మి అనే వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కుని పరారైన ఘటనలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. సీసీ ఫూటేజీ ఆధారంగా మానేపల్లి లక్ష్మణరావుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
బంగారం దొంగలించిన వ్యక్తి అరెస్ట్