మహిళలకు సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం వైకాపా!
మహిళలకు సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం వైకాపా! - హోం మంత్రి
మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వం వైకాపాదేనని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
![మహిళలకు సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం వైకాపా!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3514399-656-3514399-1560086797924.jpg)
malladhi_vishnu_spoke about_lady_greatnesss
విజయవాడలో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన మహిళలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించినపుడే అభివృద్ధి పథంలో నడుస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని...ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పలు రంగాల్లో సేవలందించిన మహిళలను సత్కరించడం అదృష్టమన్నారు.