విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొని... జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై పాత్రికేయులతో చర్చించారు. తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఆరునెలలు అవుతుందని... 2019 సార్వత్రిక ఎన్నికలలో జిల్లా సిబ్బంది, మీడియా ప్రతినిధులు చాలా సహకారాన్ని అందించారని తెలిపారు. యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్ లో మీడియా పాత్ర ముఖ్యమైనదన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ లో వేడి పదార్థాలు వేసిన వాటిని తినడం వల్ల నేడు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మితి మీరిన ప్లాస్టిక్ వినియోగం వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అందుకే విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం' - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
అతిగా ప్లాస్టిక్ ను వినియోగించటం వల్ల ప్రజలు అనేకసమస్యలు ఎదుర్కొంటున్నారని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. అందుకే విజయవాడని ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు
'ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతాం'