కృష్ణా జిల్లా వాసులు జనతా కర్ఫ్యూని శిక్షగా భావించకుండా కుటుంబసభ్యులతో గడపాలని... తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జనతా కర్ఫ్యూని ప్రజలంతా విజయవంతం చేయండంటూ పిలుపు గుడివాడ డివిజన్ పరిధిలో జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించాలని డీఎస్పీ సత్యానందం పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతి కూడలిలో అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే దగ్గరలో ఉండే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
జనతా కర్ఫ్యూని ప్రజలంతా విజయవంతం చేయండంటూ పిలుపు కరోనా బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమలానంద భారతి సూచించారు. కరోనా నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన నెల్లూరులో పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి తీవ్రమైతే అరికట్టడం కష్టమని, వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూని ప్రజలంతా విజయవంతం చేయండంటూ పిలుపు ఇదీ చదవండి:దేశంలో పెరుగుతున్న కరోనా జాడ- 283కు చేరిన బాధితులు