ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాడైన రహదారికి వెంటనే మరమ్మతులు చేయండి' - Problems of motorists in Mopidevi Krishna district

మోపిదేవి మండలం కేంద్రంలో 11 నంబరు కాలువపై నుంచి వంతెన వేశారు. దానిమీదుగా 216 జాతీయ రహదారి నిర్మించారు. వంతెన నిర్మించి ఏళ్లు గడిచిపోయాయి. పాతది కావటం వల్ల కూలింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహిస్తున్నారు.

Make repairs to the road
రహదారికి వెంటనే మరమ్మతులు

By

Published : Dec 6, 2020, 3:51 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో పురాతన వంతెనపై నిర్మించిన 216వ జాతీయ రహదారి.. కొంత భాగం కూలి పోయింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా కొందరు వంతెనపై నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. భారీ వాహనాలను మోపిదేవి, రావివారిపాలెం, వెంకటాపురం, శివరామపురం మీదుగా చల్లపల్లిలో ఉన్న జాతీయ రహదారికి కలిసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వంతెన కూలినట్టు అధికారులు కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు, వాహనదారులు మండిపడుతున్నారు. మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.227.52 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు. కూలిన వంతెనకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details