కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు,మూడేళ్ల బాలుడు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలపాలైయ్యారు.బాధితులు ప్రకాశం జిల్లా వేటపాలెం కు చెందినవారిగా గుర్తించారు.ఏడాది క్రితం మృతి చెందిన ఇంటి అల్లుడు సంవత్సరీకానికి హజరై,తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదానికి గురై చనిపోడం బంధువులను శోకసముద్రంలో ముంచింది.వీరు ప్రయాణిస్తున్న ఆటోను సీతారంపురంకు చెందిన కారు బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
సంవత్సరీకానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు.. - major road accident
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లల సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సంవత్సరీకానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు