కృష్ణా జిల్లా మైలవరంలో ఈ నెల పదో తేదీన జరిగిన విజయలక్ష్మి(37) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు గాలంకి రాజేష్‌ను 24 గంటల్లోపే పట్టుకున్నారు. విజయలక్ష్మితో వివాహేతర సంబంధంతో పాటు ఆమె కుమార్తెపై కూడా రాజేష్ అనుచితంగా ప్రవర్తిస్తుండటంతో... వివాదాలు చెలరేగాయి. కాలక్రమేణా అనుమానం నేపథ్యంలో రాజేష్ విజయలక్ష్మిని హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. హత్య చేయడానికి ఉపయోగించిన గునపం, గడ్డపారను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు - women murder case traced on 48 hourse latese news
కృష్ణా జిల్లా మైలవరంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పరారీలో ఉన్న నిందితుడు గాలంకి రాజేష్‌ను 24 గంటల్లోపే పట్టుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
మహిళ హత్య కేసును చేధించిన మైలవరం పోలీసులు