దిగజారుడు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకునే దేవినేని ఉమామహేశ్వరరావు తీరును ప్రజలందరూ చూస్తున్నారని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా క్షేత్రంలో ఘోర ఓటమి పాలైనా ఆయన తీరు ఇంకా మార్చుకోలేదని మండిపడ్డారు. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే నియోజకవర్గ పరిధిలో పదవీ కాలంలో చేసిన అక్రమాలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
'పదవీ కాలంలో చేసిన అక్రమాలకు సమాధానం చెప్పాలి' - మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు వార్తలు
తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రజా క్షేత్రంలో ఘోర ఓటమి పాలైనా... ఆయన తీరు ఇంకా మార్చుకోలేదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు