దేశం, రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా.. వాటిని నివారించడంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో పీఓడబ్ల్యూ, ఇఫ్టూ, పీడీఏస్యూ సంఘాల ఆధ్యర్యంలో ధర్నాకు దిగారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వమే నిందితులకు రక్షణగా వ్యవహరిస్తున్న పరిస్థితులు చూస్తున్నామని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగాభవాని, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు వరుసగా జరుగుతున్నా జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు.
'ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి' - divya tejaswi murder latest news update
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో పీఓడబ్ల్యూ, ఇఫ్టూ, పీడీఏస్యూ సంఘాల ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే తప్ప.. ఆచరణ శూన్యమని విమర్శించారు.
పీఓడబ్ల్యూ, ఇఫ్టూ, పీడీఏస్యూ సంఘాల ఆధ్యర్యంలో నిరసన
తెలంగాణలో దిశా హత్య జరిగితే దిశా చట్టం తెచ్చిన వైకాపా ప్రభుత్వం.. విజయవాడలో దివ్య హత్యపై ఎందుకు ఆ స్థాయిలో స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మహిళలపై వరుస హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడం సరికాదని దుయ్యబట్టారు.