మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కవలి తాలూకా, పత్రి గ్రామానికి చెందిన 50 మంది వలస కూలీలు ఫిబ్రవరి నెలలో మిర్చి కోతలకు కృష్ణాజిల్లా పోలంపల్లి గ్రామానికి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వారు స్వస్థలాలకు తిరిగి వెళ్ళలేక పోయారు. గడిచిన 40 రోజులుగా పనుల్లేక ఖాళీగా ఉంటున్నారు. పొలంలోనే తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న సరకులు, ఆహార పదార్థాలు అయిపోయాయి. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అధికారులు తమను గుర్తించి సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపించాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ రామానాయక్ వద్ద తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. పోలంపల్లి గ్రామంలో ఉన్న వలస కూలీల విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మా స్వస్థలాలకు పంపడి సార్: మహారాష్ట్ర వలస కూలీలు - ఏపీలో వలస కూలీల వార్తలు
వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి మిర్చి కోతపనులకు కృష్ణా జిల్లా పోలంపల్లి గ్రామానికి వచ్చిన వలస కూలీలు తమను స్వస్థలాలకు పంపించాలని అధికారులను కోరుకుంటున్నారు.
maharatra labors