దక్షిణకాశిలో...
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని దక్షిణకాశిగా పేరొందిన పెదకళ్లెపల్లిలో.. తెల్లవారుజామున మహా శివరాత్రి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారనీ.. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
ముక్తేశ్వర క్షేత్రంలో...
ఉత్తర వాహిని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ముక్త్యాల భవాని ముక్తేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నాన ఘట్టాల వద్ద స్నానమాచరించి... స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. నది ఒడ్డున ఉన్న ముక్తేశ్వరుడికి, కోటిలింగ క్షేత్రంలో ఉన్న పంచముఖేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వరించారు. మూడు రోజుల పాటు జరిగిే కల్యాణోత్సవం, తిరునాళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి బారుల తీరిన భక్తులకు... దేవాలయంలో ఉచిత దర్శనం లేకపోవటంతో ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 50,20 టిక్కెట్టు తీసుకున్న వారికే దర్శనం అనే నిబంధన పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాఘవాపురంలో...