కృష్ణాజిల్లా మైలవరం ద్వారకా తిరుమల దత్తత దేవాలయమైన.. భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి శివరాత్రి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ధర్మకర్త నివృతరావు సమక్షంలో వేదపండితులు శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున కల్యాణం తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
కమనీయం ముక్కంటి కల్యాణం.. కన్నుల పండువగా ఊరేగింపు - శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు తాజావార్తలు
కృష్ణాజిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం నంది వాహనంపై కన్నుల పండువగా స్వామివార్ల ఊరేగింపు జరిపారు.

కమనీయం ముక్కంటి కల్యాణం
కమనీయం ముక్కంటి కల్యాణం
మోపిదేవి మండలం, పెదకళ్ళేపల్లిలో మహాశివరాత్రికి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం కన్నులపండువగా సాగింది. కల్యాణం అనంతరం నంది వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో నిర్వహించిన కోలాటం, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి...