దేవాదాయ శాఖ చట్టం రద్దు చేసి దేవాలయాలను విముక్తి చేయాలని కోరుతూ భగవత్ రామానుజ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మహాపాద యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్లో మొదలుపెట్టిన యాత్ర విజయవాడకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల పరిస్థితిని తెలుసుకోవాలనే నిర్ణయంతో పాదయాత్రలో మార్పులు చేసినట్లు తాళ్లూరు మఠం మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు తెలిపారు.
Save Temples: దేవాలయాల విముక్తి కోసం మహా పాదయాత్ర
దేవాదాయ శాఖ చట్టం రద్దు చేసి దేవాలయాలను విముక్తి చేయాలని కోరుతూ భగవత్ రామానుజ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మహాపాద యాత్రను ప్రారంభించారు. ఆలయాలు రాజకీయ నేతల ఆవాసాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం చట్టం రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకు, కర్నాటకలోని హంపి నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాదయాత్ర అనంతంర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. పూర్వం ధర్మాన్ని రక్షించేందుకు దేవాలయాలను ఏర్పాటు చేసి వాటి రక్షణ కోసం రాజులు మాన్యాలను రాసిచ్చారు. బ్రిటిష్ కాలంలో వాటిపై పెత్తనం చెలాయించేందుకు తీసుకొచ్చిన దేవాదాయచట్టాన్ని నేటికి అమలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు రాజకీయ నేతల ఆవాసాలుగా మారుతున్నాయని ఆందోళన చెందారు. అర్చకుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. ఇప్పటికే చెన్నై, కర్నాటక, ఉత్తరఖండ్ల్లో దేవాదాయశాఖ చట్టం రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం చట్టం రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Bonda Uma : వైకాపా నేతల మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం: బోండా ఉమా