కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఎందుకూ ఉపయోగపడని స్థలాలను.. ఇళ్ల స్థలాలుగా కలెక్టర్ ఎంపిక చేశారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆరోపించారు.
మచిలీపట్టణం పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు నివాసంలో.. శాసనససభ నియోజకవర్గాల బాధ్యుల సమావేశానికి హాజరయ్యారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని వారన్నారు.