కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున్న ప్రజలు స్వీయ నియంత్రణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి సూచించారు. తాజాగా మచిలీపట్నంలో ఒకటి, చల్లపల్లి మండలంలో మరొక పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకూ బందరు డివిజన్ పరిధిలో మొత్తం 18 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం ఏడు చోట్ల కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
కేసులు పెరుగుతున్న వేళ..స్వీయ నియంత్రణే మేలు - Growing Cases in Machilipatnam
మచిలీపట్నం డివిజన్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా స్వీయ నియంత్రణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి కోరారు.

స్వీయ నియంత్రణే రక్ష