మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. పోర్టు నిర్మాణ పనుల రద్దును సవాల్ చేస్తూ నవయుగ సంస్థ వేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 66వ జీవోను నవయుగ సంస్థ.. హైకోర్టులో సవాల్ చేసింది. ఒప్పందం ప్రకారం భూములు అప్పగించడంలో ప్రభుత్వమే విఫలమైందని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించింది. పనులపై ఇప్పటికే రూ.436 కోట్లు ఖర్చుచేశామని.. ప్రభుత్వం తెచ్చిన జీవో 66 రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరింది.