సగం ధరకే బంగారం ఇప్పిస్తామని... రైస్ పుల్లింగ్ సామగ్రి అందజేస్తామని ప్రజలను మోసం చేస్తున్న 11 మంది నిందితులను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వీరు సగం ధరకే బంగారం ఇప్పిస్తామని మచిలీపట్టణానికి చెందిన ఒక వ్యక్తిని మోసం చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు గతంలో దేవాలయాల్లో దొంగిలించిన వెండి కలశాలను స్వాధీనం చేసుకున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో మరికొంత మందిని మోసం చేశారని వీటిపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని సీసీఎస్ స్టేషన్ డీఎస్పీ అజీజ్ తెలిపారు.
రైస్ పుల్లింగ్ గ్యాంగ్ అరెస్ట్ - vijayawada
రైస్ పుల్లింగ్ సామగ్రి అందజేస్తామని ప్రజలను మోసం చేస్తున్న 11మంది నిందితులను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం పోలీసులు