ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్యే బలపర్చిన వారినే అభ్యర్థులుగా పరిగణించాలి'

తొలి విడత ఎన్నికలు జరిగే విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, నున్న, నిడమానూరులో ఎమ్మెల్యే వంశీమోహన్ బలపర్చిన వారిని మాత్రమే అభ్యర్థులుగా పరిగణించాలని ఆ పార్టీ నేత గౌతమ్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.

మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి
మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి

By

Published : Feb 7, 2021, 5:13 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీమోహన్ బలపర్చిన వారినే వైకాపా అభ్యర్థులుగా పరిగణించాలని... మచిలీపట్నం పార్లమెంట్, గన్నవరం నియోజకవర్గ వైకాపా పరిశీలకులు గౌతమ్ రెడ్డి, పైలా సోమినాయుడు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల్లో వాక్ ​స్వాతంత్య్రాన్ని హరించే విధంగా వ్యవహారిస్తే ఊరుకోబోమని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్​ లో ముఖ్యమంత్రి చిత్రం కనిపిస్తోందని ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టిన గౌతమ్ రెడ్డి.. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరని పేర్కొన్నారు. అభ్యర్థుల గెలుపునకు వైకాపా శ్రేణులు, సానుభూతి పరులు పనిచేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details