ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Doctor Radha Murder Case Update: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు​ సార్​..!' - రాధ హత్య కేసులో ఊహించని మలుపు భర్తే హంతకుడు

Machilipatnam Doctor Radha Murder Case Update: ఆయన డాక్టర్‌! కానీ ప్రొఫెషనల్‌ కిల్లర్‌కు తీసిపోని రీతిలో ప్లాన్‌ వేశారు.! ఆస్తి కోసం భార్యను హత్య చేసి దొంగలు చంపేశారని నమ్మించే ప్రయత్నం చేశారు. డ్రైవర్‌ సాయంతో అంతమొందించి అనుమానం రాకుండా ఎత్తుగడలు వేశారు. పోలీసులు సాంకేతితక ఆధారాలతో సహా పసిగట్టారు. మచిలీపట్నంలో.. భార్యను హత్య చేసిన వైద్యుడి మాస్టర్‌ ప్లాన్‌ పోలీసులే నిర్ఘాంతపోయేలా చేసింది.

Machilipatnam_Doctor_Radha_Murder_Case_Update
Machilipatnam_Doctor_Radha_Murder_Case_Update

By

Published : Aug 13, 2023, 9:31 AM IST

Updated : Aug 13, 2023, 11:27 AM IST

Machilipatnam_Doctor_Radha_Murder_Case_Update: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు​ సార్​..!'

Machilipatnam Doctor Radha Murder Case Update :కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్‌ రాధ హత్యకు ఆమె భర్త ఉమామహేశ్వరరావు వేసిన ప్రణాళిక కరుడుగట్టిన హంతకుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది. భార్యను హత్య చేయాలని 3నెలల ముందే, పథకరచన చేశారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు కొన్ని నెలల క్రితమే ఆగిపోయాయి. టెక్నీషియన్‌ను కూడా పిలిపించిన మహేశ్వరరావు మరమ్మతులు అవసరం లేదని అతనికి చెప్పేశాడు. అప్పట్నుంచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

Radha Murder Case Update : జులై 26న రాధ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని తన కోడలి ప్రసవానికి వెళ్లాల్సి ఉంది. ఒకవేళ పిడుగురాళ్ల వెళ్తే ఇంకొన్నిరోజుల వరకూ రాదనుకున్నారు ఉమామహేశ్వరరావు. అందుకే జులై 25న హత్య పథకాన్ని అమలు చేశారు. ఆసుపత్రి పక్కనున్న సీసీ కెమెరాలో ఆ రోజు డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, డ్రైవర్‌ మధు సాయంత్రం 5 గంటల 45 నిమిషాల సమయంలో ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.

Husband Loknath Uma Maheswara Rao Killed Dr.Macherla Radha : హత్య తర్వాత డాక్టర్‌ లిఫ్ట్‌ ద్వారా, మధు మెట్ల గుండా కిందకు దిగడం కూడా రికార్డైంది. ఆస్పత్రికి కిలోమీటరు దూరంలోని ఓ సీసీ కెమెరాలో డ్రైవర్‌ మధు కదలికలు కనిపించాయి. వర్షంలోనే స్కూటీపై ఓ సూపర్‌ మార్కెట్‌కెళ్లిన డాక్టర్‌ ఉమామహేశ్వరరావు అక్కడ కారం ప్యాకెట్‌ కొన్నారు. పోలీసు డాగ్‌ స్క్వాడ్‌ వాసన పసిగట్టకుండా దాన్నే హత్యాస్థలిలో చల్లారు. ఈ క్లూ ఆధారంగానే దర్యాప్తు సాగింది.

Husband Loknath Maheswara Rao Killed Doctor Macherla Radha: డాక్టర్ మాచర్ల రాధ హత్య.. మొగుడే యముడయ్యాడు

హత్యాస్థలిలో పోలీసులకు ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా రాధ భర్త జాగ్రత్తలు తీసుకున్నాడు. రాధ హత్యపై పోలీసుల వద్దా ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. డాక్టర్‌ ఉమామహేశ్వరరావు ఇంట్లో కింద ఆసుపత్రి నడుస్తుండగా, రెండో అంతస్థులో నివాసం ఉంటారు. సాయంత్రం సమయం, అదీ జోరుగా వర్షంలో దొంగతనానికి ఎవరొస్తారని పోలీసులు సందేహించారు. పైగా ఇంట్లో ఉన్న 8 కిలోల బంగారం, 50 లక్షల నగదు జోలికి వెళ్లకుండా కేవలం రాధ ఒంటిపై ఉన్న నగలు మాత్రమే ఎందుకు తీసుకెళ్లాలని పోలీసులు అనుమానించారు.

ఇంటి లొకేషన్‌లోని సెల్‌ టవర్‌ పరిధిలో 12 ఫోన్‌ నెంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అందులో ఓ నెంబర్‌ను పరిశీలించగా అది డాక్టర్‌ ఉమామహేశ్వరరావుది అని పోలీసులు తేల్చారు. ఉమామహేశ్వరరావు నంబర్‌ నుంచి డ్రైవర్‌ మధు నెంబరుకు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పదే పదే కాల్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

Doctor Murder: ఇంట్లోకి చొరబడి.. కళ్లలో కారం చల్లి.. మచిలీపట్నంలో డాక్టర్​ దారుణ హత్య

ఎప్పట్నుంచో డాక్టర్‌ ఇంట్లో పనిచేస్తున్నా డ్రైవర్‌ మధును పోలీసులు తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌కాల్‌ లిస్ట్‌ తదితర ఆధారాల్ని ముందు పెట్టి వాటి సంగతేంటని నిలదీశాడు. ఇద్దరం కలిసి జులై 24న సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 2 నిమిషాల మధ్య చంపినట్లు అంగీకరించాడు. అప్పుడు డాక్టర్‌ ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత నోరు విప్పని రాధ భర్త, ఇక తప్పించుకోలేని తెలిసి ఒప్పేసుకున్నారు. భార్యను హత్య చేశాక నేరుగా కింద ఉన్న తన ఛాంబర్‌లోకి వచ్చారు డాక్టర్‌ ఉమా మహేశ్వరరావు.....! హత్యతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే ఐడియాల్ని గూగుల్‌లో వెతికారు. ఆస్పత్రిలోని ప్రతిఅంతస్తుకు వైఫై రూటర్లు వేర్వేరుగా ఉన్నాయి.

ఆ సమయంలో తాను పై అంతస్థులోని రూటర్‌కు కనెక్టై లేనని పోలీసుల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసుల విచారణకు ఆ డేటా ప్రింట్‌ తీసుకుని మరీ వెళ్లారు. ఐతే.. హత్య జరిగిన సమయంలో రెండో అంతస్థులోని రూటర్‌కు అనుసంధానమైన ఆయన ఫోన్‌ ఆ తర్వాత కింది అంతస్థులోని వైఫైకు కనెక్టైనట్లు పోలీసులు గుర్తించారు. పైగా తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, మీరెలా ఛేదించారని పోలీసులను డాక్టర్‌ మహేశ్వరరావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.

Mounika Family Murder Case Update: నెల్లూరు జిల్లాలో ఆ ముగ్గురిని చంపింది.. ఆ ముగ్గురే.. ఆస్తి కోసమేనటా!

Last Updated : Aug 13, 2023, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details