మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో మృతదేహం అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన కామాటి అశ్వనీకుమార్ సస్పెన్షన్‌కు గురయ్యారు. మీడియాలో ప్రసారమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ ఇంతియాజ్... ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఓ మహిళ మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు కామాటి అశ్వనీకుమార్ రూ. 6 వేలు డిమాండ్ చేసి... చివరకు రూ. 1500 నగదు తీసుకున్నాడు. మృతదేహాన్ని ఇచ్చేందుకు నగదు తీసుకోవటం హేయమైన చర్య అని.. అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.