జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 32 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏపీలోని 4 లోక్‌సభ, తెలంగాణలోని ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ ఇన్‌ఛార్జ్ వేమూరి శంకర్‌గౌడ్‌ను బరిలోకి దించాలని జనసేనాని నిర్ణయించారు.
ఏపీలోని జనసేన పార్లమెంటు అభ్యర్థులు
క్ర.సంఖ్య | పార్లమెంటు నియోజకవర్గం | అభ్యర్థి |
1 | అరకు | పంగి రాజారావు |
2 | మచిలీపట్నం | బండ్రెడ్డి రాము |
3 | రాజంపేట | సయ్యద్ ముకరం చాంద్ |
4 | శ్రీకాకుళం | మెట్ట రామారావు. |