ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rains in state: బంగాళాఖాతంలో అల్పపీడనం...మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ ఒడిశాలపై ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

By

Published : Sep 5, 2021, 8:09 AM IST

Low pressure in the Bay of Bengal ... Moderate to heavy rains in state
బంగాళాఖాతంలో అల్పపీడనం...మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు

ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. దీని ప్రభావం పశ్చిమ బంగ, ఒడిశాలపై ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోనూ చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపారు.

ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: corona: తెలుగు రాష్ట్రాల్లో ఏవై.12 కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details