కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలం దారుణం జరిగింది. మొగులూరుకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఎన్నో ఆశలతో తమ ప్రేమను పెద్దలకు తెలియజేశారు. వారిని ఒప్పించటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఎంతకీ పెద్దలు ఒప్పుకోకపోవటంతో... కలిసి జీవించలేమని తెలిసి.. సోమవారం ఆత్మహత్యకు యత్నించారు. నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమ జంట మృతి చెందారు.
lovers suicide: ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలు ఒప్పుకోలేదని.. - కృష్ణా జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో... చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
lovers suicide