ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలంగాణతో చర్చించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇప్పించండి' - ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్య సరకు రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లారీ ఓనర్స్ అసోషియేషన్ కోరింది. ఈ విషయమై తెలంగాణ రవాణా శాఖ మంత్రితో చర్చించాలని అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

lorry owners
lorry owners

By

Published : Oct 14, 2020, 6:53 PM IST

ఆంధ్రా, తెలంగాణ మధ్య సరకు రవాణా వాహనాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లారీ ఓనర్స్ అసోషియేషన్ కోరింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు బుధవారం లేఖ రాశారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ అంశం చాలా ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదని అందులో పేర్కొన్నారు.

ఈ విషయమై తెలంగాణ రవాణా శాఖ మంత్రితో చర్చించాలని కోరారు. ఆర్టీసీ రూట్​ల విషయంలోనూ తెలంగాణ ప్రతినిధులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని... ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత అధికారులకు చుక్కలు చూపిస్తున్నారని ఈశ్వరరావు చెప్పారు. ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ విజయ్ కుమార్​తో సత్వరం చర్చలు జరిపి పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details