కృష్ణా జిల్లా కంచికచర్ల విజయవాడ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ వద్ద రిపేర్ చేస్తున్న లారీ పక్కకు ఓరిగిపోవడంతో మెకానిక్ ఏసు లారీ కింద చిక్కుకున్నాడు. హుటాహూటిన స్పందించిన కంచికచర్ల ఎస్సై లక్ష్మీ సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి సిబ్బందితో కలిసి క్రేన్ల సాయంతో లారీని పైకి లేపి అతణ్ని క్షేమంగా బయటకు తీశారు. మెకానిక్ క్షేమంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స కోసం అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరమ్మతు చేస్తుండగా పక్కకు ఒరిగిన లారీ.. తప్పిన ప్రమాదం - కంచికచర్ల వద్ద లారీ ప్రమాదం
మరమ్మతు చేస్తుండగా లారీ పక్కకు ఒరిగిపోవడంతో మెకానిక్ దాని కింద చిక్కుకున్న ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు, రహదారి సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పింది.
మరమ్మతు చేస్తుండగా పక్కకు ఒరిగిన లారీ.. తప్పిన ప్రమాదం