తల్లి అంత్యక్రియలకోసం వెళ్లి ప్రమాదంలో కుమారుడు, కోడలు మరణించిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా పెంచికల్‌పేట సమీపంలో జరిగింది. అమ్మని ఆఖరి చూపు చూసేందుకు కొడుకు, కోడలు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ దంపతులిద్దరూ చనిపోయారు.
తల్లి అంత్యక్రియలకు వెళ్లి.. కొడుకు దుర్మరణం - car accident in penchikalpet
తల్లి మరణ వార్తతో కుంగిపోయిన ఓ విశ్రాంత సీఐ ఆమె అంత్యక్రియలకి సొంతూరికి బయలుదేరాడు. మార్గమధ్యలో వారు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టగా..దంపతులిద్దరూ మరణించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట సమీపంలో జరిగింది.

తెలంగాణలోని పెంచికల్‌పేటలో కారును ఢీకొన్న లారీ
తెలంగాణలోని పెంచికల్‌పేటలో కారును ఢీకొన్న లారీ
పెంచికల్‌పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్‌కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.