ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సును ఢీకొన్న లారీ.. ప్రయాణికులు సురక్షితం - నందిగామలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు, లారీ రోడ్డు పక్కనే బోల్తా పడ్డాయి. ప్రమాదం సమయంలో.. బస్సులో సుమారు 30 ప్రయాణికులు ఉన్నారు.

lorry hit bus at nadhigama
బస్సును ఢీకొన్న లారీ.. ప్రయాణికులు సురక్షితం

By

Published : Sep 19, 2020, 1:24 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. బస్సు, లారీ రోడ్డు పక్కనే బోల్తా పడ్డాయి. ప్రమాద సమయంలో.. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, లారీ క్యాబిన్లో ఇద్దరు ఇరుక్కుపోయారు. గంట పాటు శ్రమించి పోలీసులు వారిని బయటకు తీసుకువచ్చారు.

బస్సు.. 30 మంది ప్రయాణికులతో పూర్తిగా బోల్తా పడింది. ఆ సమయంలో అంతా గందరగోళానికి గురయ్యారు. ప్రయాణికులు ఒక్కసారిగా ఏమి జరిగిందో అని ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఊరికి చివరలో జరిగిన పరిస్థితుల్లో... బాధితులను కాపాడేందుకు ఎవరూ ముందుకురాలేదు. ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టుకుని బయటకు వచ్చామని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారందర్నీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details