ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: బైక్​ను ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

Lorry Bike Accident: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తితో పాటు ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా ఏ.కొండూరు వద్ద చోటుచేసుకోగా..ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్​ను ఢీకొన్న లారీ
బైక్​ను ఢీకొన్న లారీ

By

Published : Dec 8, 2021, 7:25 PM IST

Lorry Bike Accident: కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం నాగసింధు స్పిన్నింగ్ మిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం నుంచి జగదల్ పూర్ జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న తాత శ్రీనివాసరావు, ఆయన మనవరాలు యస్వీత (5) అక్కడికక్కడే మృతి చెందారు.

శ్రీనివాసరావు కూతురు సత్యవేణి, మరో మనవరాలు భవ్యశ్రీకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మైలవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details