విజయవాడ మహానాడు రోడ్డు కూడలిలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మురళినగర్కు చెందిన కీర్తి చంద్రిక అనే యువతి మృతి చెందింది. గ్యాస్ బండల లోడ్‌తో వెళుతున్న లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తి చంద్రిక అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... యువతి మృతి - lorry accident at gannavaram
విజయవాడలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో లారీ ఢీకొని ఒక యువతి మృతి చెందింది. గన్నవరం రహదారిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా దెబ్బతింది.
గన్నవరం రహదారిలో మరో ప్రమాదం
విజయవాడ నగర శివారు ముస్తాబాద్ గన్నవరం రహదారిలో రెండు లారీలు ఢీకొన్నాయి. వెనక వస్తున్న లారీ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న ముందు లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలవరం కాల్వ మట్టి తరలిస్తున్న లారీలు అధిక సంఖ్యలో... ముస్తాబాద్ గ్రామం గుండా వేగంగా ప్రయాణిస్తుండటంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. లారీల నుంచి వెలువడుతున్న దుమ్ముదూళితో తమకు శ్వాశ కోశవ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.