ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వసూలు చేయొద్దని ఆదేశాలు ఉన్నా... పట్టించుకోరా?'

ఆశీలు (మున్సిపాలిటీలకు చిరువ్యాపారులు, ప్రైవేటు వాహనదారులు కట్టే పన్ను) వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నందిగామలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్ జయరామ్, ఛైర్​పర్సన్ వరలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు.

నందిగామలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
నందిగామలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

By

Published : Jul 12, 2021, 3:49 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లు (మున్సిపాలిటీలకు చిరువ్యాపారులు, ప్రైవేటు వాహనదారులు కట్టే పన్ను) నిలిపివేయాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గూడ్స్ వాహనాలకు ఆశీలు వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ప్రైవేటు గుత్తేదారులు వసూలు చేస్తున్నారని ఆందోళన చేశారు.

స్థానిక లారీ అసోసియేషన్ కార్యాలయం నుంచి నగర పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం... పురపాలక కమిషనర్ జయరామ్, ఛైర్ పర్సన్ వరలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details