హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా.. 15 మందిపై కేసు నమోదు - ఇసుక లారీలు స్వాధీనం
కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీలను రాష్ట్ర సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. నందిగామ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. వాహనాలను సీజ్ చేసిన పోలీసులు... 15 మందిపై కేసులు నమోదు చేశారు.