తెలుగు భాషపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు అని జగన్ ఉద్యమం చేసినప్పుడు వారి అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా అని ట్విట్టర్ వేదికగా లోకేశ్ నిలదీశారు."ఎందుకింత తెగులు?", "తెలుగు లెస్సేనా?" అంటూ ఉద్యమం చేసిన రోజు జగన్ బుద్ధి ఏమైందని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసింది గుర్తులేదా... అని ప్రశ్నించారు. నగరపాలక పాఠశాలల్లో తెదేపా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తే... ఆరోజు జగన్ అడ్డుపడ్డారని గుర్తు చేశారు.
సీఎం గారూ.. తెలుగుపై మీరు చేసిన యుద్ధం గుర్తు లేదా..? - నారా లోకేష్ తెలుగుపై ట్వీట్స్ న్యూస్
తెలుగు భాష పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసింది గుర్తులేదా?