ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కెటింగ్ సౌకర్యాలు లేక రైతుల అవస్థలు: లోకేష్ - రైతులను ఆదుకోవాలని లోకేశ్ ట్వీట్స్

మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని నారా లోకేశ్​ ట్వీట్ చేశారు. ఉద్యాన, ఆక్వారంగ రైతుల కష్టాలు వర్ణనాతీతమన్నారు. రైతుల అవస్థలు తెలిపేలా వీడియో పోస్ట్‌ చేశారు. వీలైనంత త్వరగా రైతుల సమస్యలు పరిష్కరిచాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

lokesh-tweets-on-farmers
lokesh-tweets-on-farmers

By

Published : Mar 31, 2020, 6:43 PM IST

మార్కెటింగ్ సౌకర్యాలు లేక రైతుల అవస్థలు: లోకేష్

రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో కర్షకుల కన్నీరు ఆగడం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​అన్నారు. అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రాకపోగా.. కనీసం ఇతర ప్రాంతాలకు తరలించే రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారని ట్వీట్‌ చేశారు. ఉద్యాన, ఆక్వా రంగ రైతుల కష్టాలు వర్ణనాతీతమని ఓ వీడియో పోస్ట్‌ చేశారు. గిట్టుబాటు ధర లేక వరి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కసారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టమని.... వీలైనంత త్వరగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details