ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణకు నారా లోకేశ్​ చిట్కాలు..!

అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోతే కరోనాను నివారించవచ్చని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు ఆయన పలు సూచనలు చేశారు.

lokesh-tips-for-corona-on-twitter
lokesh-tips-for-corona-on-twitter

By

Published : Mar 28, 2020, 8:03 PM IST

కరోనాను నివారించడానికి అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవటం మంచిదని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కుడిచేతి వాటం వాళ్లు ఎడమ చేతితో, ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చేయాలని సూచించారు. తద్వారా ఆ చేతిని ముఖానికి తాకడం తగ్గుతుందన్నారు. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకు కరోనా బారిన పడకుండా ఆపుతుందన్న లోకేశ్​.. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమేనని తెలిపారు. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో ఈ తరహా చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details