ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారు'

విశాఖలో డాక్టర్​ సుధాకర్​ను తాళ్లతో కట్టి పోలీస్​స్టేషన్​కు తరలించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

lokesh reacted on Dr Sudhakar arrest
నారా లోకేష్

By

Published : May 16, 2020, 9:24 PM IST

సీఎం జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శానాస్త్రాలు సంధించారు.

డాక్టర్. సుధాకర్ అరెస్ట్ పై నారా లోకేశ్ ట్వీట్

నిజాలు బయటపెట్టి ఉత్తమ వైద్యుడైన సుధాకర్​​పై కక్ష కట్టి వేధిస్తున్న జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ గారిది క్రూరమైన మనస్తత్వమని..మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్​ని నియంతలా సస్పెండ్ చేశారు. ఒక దళిత డాక్టర్​ని తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం సీఎం ఉన్మాదానికి పరాకాష్ట. వైకాపా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. -

-ట్విట్టర్​లో లోకేష్

ఇదీచూడండి.వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details