ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పసుపు రైతులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ - ఏపీలో పసుపు రైతుల వార్తలు

రాష్ట్రంలో పసుపు రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు.

పసుపు రైతులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ
పసుపు రైతులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ

By

Published : May 12, 2020, 3:16 PM IST

పసుపు రైతులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ

పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్​కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన... 33వేల ఎకరాల్లో పసుపును సాగు చేయగా 8.25 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారని పేర్కొన్నారు.

కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారన్న లోకేశ్ ప్రభుత్వం పసుపు క్వింటాలుకు 6 వేల 8 వందల 50 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు క్వింటా 15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైకాపా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.

ఇవీ చదవండి

'మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లను వైకాపా దోచేయడం దారుణం'

ABOUT THE AUTHOR

...view details