ఎడమ కాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కట్టు కట్టించుకున్నట్లుగా... ముఖ్యమంత్రి తెలివి ఉందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. పోలవరం నిర్మాణంలో ఖర్చు తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు రేటు పెంచిన లాజిక్... రివర్స్ టెండర్ వెనకున్న అసలైన మేజిక్కని సామాన్య ప్రజలకూ అర్థమైందని చెప్పారు. పోలవరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టును, కేవలం స్వప్రయోజనాల కోసం ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అప్పగించడం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. రివర్స్ టెండరింగ్లో భాగంగా ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు: లోకేశ్ - lokesh cricizes ycp ruling
రివర్స్ టెండరింగ్ విధానంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విధానంలో పోలవరం ప్రాజెక్టు పైకి చైనా 'మేఘా'లు కమ్ముకొస్తున్నాయని ఎద్దేవా చేశారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్